కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.

  2. దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.

  3. యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా,

  4. ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.

  5. మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను.

  6. తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తుచేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు.

  7. మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు.

  8. ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు.

  9. అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.”

  10. కాని, ప్రియ మిత్రులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు మీకు ముందుగానే ఏమి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి.

  11. మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి.

  12. మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,

  13. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.

  14. త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు.

  15. అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు.

  16. యోహాను,

  17. నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,

  18. తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

  19. “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.”

  20. “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు.

  21. యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను.

  22. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.

  23. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను.

  24. ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి.

  25. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది.