కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకున్నారు.

  2. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  3. మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,

  4. సహోదరీ సహోదరులారా, మిగిలిన విషయాలు ఏంటంటే, ప్రభువు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారమే మరింతగా వేగంగా వ్యాపించి ఘనత పొందేలా మాకోసం ప్రార్థించండి.

  5. అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.

  6. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము.

  7. ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.

  8. సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.

  9. అలాంటివారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకుంటున్నాము.

  10. సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!

  11. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరితో ఉండును గాక.

  12. మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,

  13. విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:

  14. నన్ను నమ్మకమైన వానిగా తలంచి బలపరచి తన సేవ కోసం నన్ను నియమించిన, మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  15. మన ప్రభువు యొక్క కృప, యేసు క్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.

  16. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. అలాంటి పాపులలో నేను అతి దుష్టుడను.

  17. అయితే ఆ కారణంగానే, నిత్యజీవాన్ని పొందడానికి ఆయనలో నమ్మకముంచబోయే వారికి మాదిరిగా ఉండడానికి, అతి దుష్టుడనైన నాలో క్రీస్తు యేసు తన యొక్క అపరిమితమైన దీర్ఘశాంతాన్ని చూపించారు.

  18. ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.

  19. ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు.

  20. ఆయనే ప్రజలందరి రక్షణ కోసం విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.

  21. దీని కోసమే నేను ప్రకటించేవానిగా, అపొస్తలునిగా యూదేతరులకు నమ్మకమైన బోధకునిగా ఉండడానికి నియమించబడ్డాను, నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పడం లేదు.

  22. తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజలమధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు.

  23. ఈ విషయాలను సహోదరి సహోదరులకు తెలియజేసినట్లైతే, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమైన సత్యాలు మంచి బోధలలో పోషించబడి క్రీస్తు యేసుకు మంచి సేవకునిగా ఉంటావు.

  24. అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.

  25. అయితే యవ్వన విధవరాండ్రను ఆ జాబితాలో చేర్చకూడదు. ఎందుకంటే, వారు మేము క్రీస్తు కొరకే జీవిస్తామని నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తమ శారీరక వాంఛలకు లొంగిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.