కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు.

  2. అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”

  3. దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.

  4. “వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను.

  5. “ఇశ్రాయేలీయుల పెద్దలు నీ మాట వింటారు. అప్పుడు నీవు వారితో కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పాలి.

  6. అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు.

  7. అప్పుడు నీవు ఫరోతో, ‘యెహోవా నాతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు నా మొదటి సంతానమైన కుమారుడు,

  8. అప్పుడు మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి,

  9. అప్పుడు వారు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను పట్టించుకున్నాడని తమ బాధలను చూశాడని విని వారు తమ తలలు వంచి ఆరాధించారు.

  10. ఆ తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పిన మాట ఇదే: ‘అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ ”

  11. అందుకు ఫరో, “నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను” అన్నాడు.

  12. ఫరో యొక్క బానిస నాయకులు వారు నియమించిన ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులను కొట్టి, “నిన్న లేదా ఈ రోజు మీ ఇటుకల కోటా మునుపటిలా ఎందుకు చేరుకోలేదు?” అని అడిగారు.

  13. అప్పుడు ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో దగ్గరకు వెళ్లి, “మీ సేవకుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?

  14. “మీరు ప్రతిరోజు చేయాల్సిన ఇటుకల సంఖ్య ఏమాత్రం తగ్గించబడదు” అని తమతో చెప్పినప్పుడు తాము కష్టాల్లో చిక్కుకున్నామని ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు గ్రహించారు.

  15. నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు.

  16. అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.

  17. “కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను.

  18. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”

  19. మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.

  20. “వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”

  21. అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.

  22. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.

  23. వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ;

  24. “ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం ఈజిప్టులో నుండి బయటకు తీసుకురండి” అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే.

  25. ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.