కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను జాగ్రత్తగా విన్నాను, కానీ వారు సరియైనది చెప్పరు. “నేనేం చేశాను?” అని అంటూ, వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు.

  2. ఆకాశంలోని కొంగకు కూడా తన నిర్ణీత కాలాలు తెలుసు, అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు తమ వలస సమయాన్ని గమనిస్తాయి. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధులు తెలియవు.

  3. “ ‘శాస్త్రుల అబద్ధాల కలం, దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, “మేము జ్ఞానులం, ఎందుకంటే మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?

  4. జ్ఞానులు సిగ్గుపడతారు; వారు భయపడి చిక్కుల్లో పడతారు. వారు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినప్పుడు, వారికి ఇక జ్ఞానం ఎక్కడుంది?

  5. కాబట్టి నేను వారి భార్యలను ఇతర పురుషులకు వారి పొలాలను క్రొత్త యజమానులకు ఇస్తాను. అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు, యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.

  6. నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.

  7. వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు.

  8. “ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చింది వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ”

  9. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం ఒక్కచోట చేరి, కోటగోడలు గల పట్టణాలకు పారిపోయి అక్కడ నశించుదాం! మన దేవుడైన యెహోవా మనకు నాశనాన్ని విధించి, మనకు త్రాగడానికి విషం కలిపిన నీళ్లు ఇచ్చారు, ఎందుకంటే మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము.

  10. “చూడండి, నేను మీ మధ్యకు విషసర్పాలను, అదుపు చేయలేని మిడునాగులను పంపుతాను, అవి మిమ్మల్ని కాటేస్తాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”

  12. “ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; వారు నన్ను గుర్తించరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  13. నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  14. కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను?

  15. అందుకు నేను వారిని శిక్షించకూడదా? ఇలాంటి దేశంపై నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  16. నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.

  17. “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”

  18. దీనిని గ్రహించగల జ్ఞాని ఎవరు? యెహోవా నుండి ఉపదేశం పొందుకొని దాన్ని వివరించగల వారెవరు? దేశం ఎందుకు శిథిలమై ఎవరు దాటలేని ఎడారిలా పాడైంది?

  19. యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు.

  20. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “చూడండి, నేను ఈ ప్రజలను చేదు ఆహారం తినేలా, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను.

  21. వారికి గాని వారి పూర్వికులకు గాని తెలియని దేశాల మధ్య వారిని చెదరగొట్టి, వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.”

  22. సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇప్పుడు ఆలోచించండి! విలపించే స్త్రీలను పిలిపించండి; వారిలో అత్యంత నైపుణ్యం ఉన్న వారి కోసం పంపండి.

  23. స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.

  24. ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”

  25. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,