కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. “కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  3. ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.

  4. యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.

  5. యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.

  6. దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.

  7. అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.

  8. అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.

  9. ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

  10. యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.

  11. ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: “ఈ సమయంలో నేను ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. వారు పట్టబడేలా నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”

  12. కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.

  13. యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.

  14. యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.

  15. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

  16. యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:

  17. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నిబంధన నియమాలను పాటించనివాడు శాపగ్రస్తుడు.

  18. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి ఇనుమును కరిగించే కొలిమి నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనలు.’ నేను ఇలా అన్నాను, ‘నాకు విధేయత చూపి, నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేయండి, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను దేవునిగా ఉంటాను.

  19. అప్పుడు నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను’ అని వారితో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను.” నేను, “ఆమేన్, యెహోవా” అని జవాబిచ్చాను.

  20. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.

  21. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు, “నాకు లోబడండి” అని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను.

  22. అయితే వారు వినలేదు లేదా పట్టించుకోలేదు. బదులుగా, వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించారు. కాబట్టి నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన శాపాలన్నిటిని వారిపైకి తెచ్చాను, కానీ వారు పాటించలేదు.’ ”

  23. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజల్లోనూ, యెరూషలేములో నివసించేవారిలోనూ కుట్ర ఉంది.

  24. నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు.

  25. కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వారు తప్పించుకోలేని విపత్తును వాళ్ల మీదికి తెస్తాను. వారు నాకు మొరపెట్టుకున్నా, నేను వినను.