కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు.

  2. వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.

  3. అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు.

  4. రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు.

  5. వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను.

  6. కాని, నాకు సేవచేయడంలో ఇతర దేశాల రాజులకు సేవచేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి కాబట్టి వారు షీషకుకు దాసులవుతారు.”

  7. ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చినప్పుడు, అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు.

  8. రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా గదిలో ఉంచేవారు.

  9. రెహబాము తనను తగ్గించుకున్నందుకు, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుకు యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేయక, అతని మీద నుండి తన కోపం మళ్ళించుకున్నాడు.

  10. రాజైన రెహబాము యెరూషలేములో సుస్థిరంగా ఉండి రాజుగా పరిపాలిస్తూ వచ్చాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు, రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.

  11. రెహబాము యెహోవాను వెదకడం మీద మనస్సు నిలుపుకోలేదు, కాబట్టి చెడుగా ప్రవర్తించేవాడు.

  12. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా?

  13. “ఇక ఇప్పుడేమో దావీదు వారసుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించాలని మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి మీరు మహా సైన్యంగా ఉన్నారు. మీతో యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు ఉన్నాయి.

  14. అయితే మీరు అహరోను కుమారులైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి, ఇతర దేశాల ప్రజల్లా మీ సొంత యాజకులను నియమించుకోలేదా? ఒక కోడెతో ఏడు పొట్టేళ్లతో తనను తాను పవిత్రం చేసుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకులవుతున్నారు.

  15. “మా విషయానికొస్తే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవచేసే యాజకులు అహరోను కుమారులు; లేవీయులు వారికి సహాయం చేస్తారు.

  16. ప్రతి ఉదయం సాయంత్రం వారు యెహోవాకు దహనబలులు అర్పిస్తారు, పరిమళ ధూపం వేస్తారు. వారు ఆచారం ప్రకారం వారు పవిత్రమైన బల్లపై రొట్టెలు పెట్టి, ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభంపై దీపాలను వెలిగిస్తారు. మేము మా దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నాము. కాని మీరు ఆయనను విడిచిపెట్టారు.

  17. దేవుడు మాతో ఉన్నారు; ఆయన మా నాయకుడు. ఆయన యాజకులు తమ బూరలతో మీమీద యుద్ధనాదం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వికుల దేవుడైన యెహోవాతో పోరాడకండి, ఎందుకంటే మీరు గెలువలేరు.”

  18. యూదా వారు, తాము ముందు వెనుక ముట్టడి చేయబడ్డామని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టారు. యాజకులు తమ బూరలు ఊదగా,

  19. యూదా వారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుట యూదా వారి ఎదుట యరొబామును ఇశ్రాయేలు సైన్యమంతటిని తరిమివేశారు.

  20. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలు వారిని యూదా వారి చేతులకు అప్పగించారు.

  21. ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు.

  22. అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు.

  23. ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు.

  24. అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు.

  25. దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.