కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.

  2. అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.

  3. ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు.

  4. ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు.

  5. గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు.

  6. దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా,

  7. అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.

  8. ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు.

  9. అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు.

  10. ఒక దేశం మరొక దేశాన్ని, ఒక పట్టణం మరొక నగరాన్ని నాశనం చేసుకుంటున్నాయి, ఎందుకంటే దేవుడు వారిని అన్ని రకాల బాధలతో ఇబ్బంది పెడుతున్నారు.

  11. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం కొండ సీమలో తాను వశం చేసుకున్న పట్టణాల్లో ఉన్న విగ్రహాలను, అసహ్యమైన వాటన్నిటిని తీసివేశాడు. యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించాడు.

  12. అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.

  13. ఆ రోజు వారు యెహోవాకు 700 ఎద్దులు, 7,000 గొర్రెలు బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడిగా తీసుకువచ్చిన వాటిలోనివి.

  14. వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు.

  15. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకనివారు స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా, వారికి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు.

  16. వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ బూరలు, కొమ్ములు ఊదుతూ, యెహోవా సమక్షంలో ప్రమాణం చేశారు.

  17. ఆ విధంగా యూదా వారంతా హృదయమంతటితో ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రమాణం విషయం అందరు సంతోషించారు. వారు మనస్పూర్తిగా యెహోవాను వెదికారు. ఆయన వీరికి దొరికాడు. అన్ని దిశలా వారికి నెమ్మదిని ఇచ్చారు.

  18. అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు.

  19. అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో నుండి వెండి బంగారాలు తీసి దమస్కులో పరిపాలిస్తున్న సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.

  20. ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక సిరియా రాజు ఆరాముపై ఆధారపడ్డావు. అందుచేతే అరాము రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకుంది.

  21. కూషీయులు లిబియానీయులు మహా సైన్యంగా చాలా రథాలలో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందున ఆయన వారిని నీ వశం చేశాడు.

  22. తన పట్ల యథార్థంగా హృదయం ఉన్నవారికి సాయం చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆ విషయంలో నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. ఇకనుండి నీకు ఎప్పుడూ యుద్ధాలే.”

  23. ఆసా పరిపాలిస్తున్న ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానివలన అతడు చాలా బాధ పడినా దాని గురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులను సహాయం కోరాడు.

  24. యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.

  25. అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.