కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు.

  2. “యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.

  3. కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,

  4. నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.

  5. ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.

  6. అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా?

  7. మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.

  8. యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.

  9. యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.

  10. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు.

  11. కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు.

  12. ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.

  13. కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది.

  14. దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు.

  15. దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.

  16. ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు.

  17. అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు.

  18. దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు. అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు.

  19. ఇంకా ఆయన, “నేను నీ తండ్రి దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.

  20. అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.

  21. కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.

  22. ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను.

  23. కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.

  24. అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు.

  25. అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు.