కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు.

  2. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.

  3. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు.

  4. తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు.

  5. రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు.

  6. మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని:

  7. “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు.

  8. సర్వశక్తిగల దేవుడు ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.”

  9. అప్పుడు అతడు, “మీకు క్షేమం కలుగును గాక మీరు భయపడకండి, మీ దేవుడు, మీ తండ్రి యొక్క దేవుడు, ఈ ధనాన్ని మీ గోనెసంచులలో పెట్టారు; మీ వెండి నాకు ముట్టింది” అని అన్నాడు. తర్వాత షిమ్యోనును వారి దగ్గరకు తీసుకువచ్చాడు.

  10. యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు.

  11. అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక!

  12. యూదా జవాబిస్తూ, “మా ప్రభువా, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలం? మీ దాసుల అపరాధాన్ని దేవుడు బయటపెట్టారు. మేమిప్పుడు మా ప్రభువు బానిసలం; మాలో ఎవరి సంచిలో గిన్నె దొరుకుతుందో వాడు కూడా మా ప్రభువుకు దాసుడవుతాడు” అన్నాడు.

  13. అయితే యోసేపు, “అలా చేయడం నాకు దూరం అవును గాక! ఎవరి దగ్గర గిన్నె దొరికిందో అతడు మాత్రమే నా బానిస. మిగిలిన మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్లండి” అన్నాడు.

  14. ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు.

  15. అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.

  16. “కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు.

  17. ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి!

  18. కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు.

  19. రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.

  20. ఆయన, “నేను దేవున్ని, నీ తండ్రి యొక్క దేవున్ని. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.

  21. యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి,

  22. “వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు.

  23. ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.

  24. అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు,

  25. అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు: ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ” కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు.