కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.

  2. (ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)

  3. యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు.

  4. అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.

  5. అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి.

  6. అతనికి బాగా దాహం వేయడంతో యెహోవాకు మొరపెట్టి, “మీ సేవకుడనైన నాకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతిలేనివారి చేతుల్లో పడాలా?” అన్నాడు.

  7. అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.

  8. అతడు ఆమెకు మొత్తం చెప్పేశాడు, “నేను పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాను. నా తలమీద ఇంతవరకు ఎన్నడు మంగల కత్తి పడలేదు. నా తలవెంట్రుకలు పూర్తిగా తీసివేస్తే నా బలం తొలగిపోయి నేను అందరు మనుష్యుల్లా బలహీనమవుతాను” అని చెప్పాడు.

  9. అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.

  10. అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు.

  11. అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది.

  12. అతడు ఆ పదకొండు వందల షెకెళ్ళ వెండిని తన తల్లికి తిరిగి ఇచ్చేసినప్పుడు ఆమె, “నేను నా వెండిని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుడు వెండితో పొదిగించిన ఒక విగ్రహం తయారుచేసిన తర్వాత అది తిరిగి నీకు ఇచ్చేస్తాను” అని అన్నది.

  13. మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.

  14. అప్పుడు వారు అతనితో, “మా ప్రయాణం సఫలమవుతుందో లేదో దయచేసి దేవుని దగ్గర విచారించి మాకు చెప్పు” అని అన్నారు.

  15. యాజకుడు వారికి జవాబిస్తూ, “క్షేమంగా వెళ్లండి, మీ ప్రయాణానికి యెహోవా యొక్క ఆమోదం ఉంది” అన్నాడు.

  16. మీరు అక్కడికి చేరిన తర్వాత ధైర్యంగా ఉన్న జనాన్ని విశాల ప్రదేశాన్ని, ఏ కొరత లేని స్థలాన్ని మీరు చూస్తారు, దానిని దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు” అన్నారు.

  17. షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.

  18. అందుకతడు, “మేము యూదాలోని బేత్లెహేము నుండి ప్రయాణమై నేను నివసించే ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం, నేను అక్కడివాడను. నేను యూదాలోని బేత్లెహేముకు వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంటికి చేర్చుకోలేదు.

  19. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.

  20. ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.

  21. ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.

  22. ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా ఎదుట సాయంత్రం వరకు ఏడ్చి, “మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “వారి మీదికి వెళ్లండి” అన్నారు.

  23. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, సైన్యమంతా బేతేలుకు వెళ్లి అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుని ఏడ్చారు. వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దహనబలులు సమాధానబలులు యెహోవాకు అర్పించారు.

  24. ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది,

  25. అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?” యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.