కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

  2. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే,

  3. నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”

  4. తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు.

  5. అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.

  6. ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు.

  7. మీరు సహాయం చేయరని తెలుసుకొని, నేను నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాను. యెహోవా వారి మీద నాకు జయం ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు నాతో పోట్లాడడానికి ఈ రోజు వచ్చారు?” అని అన్నాడు.

  8. ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు.

  9. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.

  10. నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”

  11. అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు.

  12. అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ”

  13. అప్పుడు మనోహ యెహోవాకు, “ప్రభువా, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలున్ని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనున్ని మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను” అని ప్రార్ధించాడు.

  14. దేవుడు మనోహ ప్రార్ధన విన్నారు. ఆ స్త్రీ పొలంలో ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు; కాని అప్పుడు తన భర్త మనోహ ఆమెతో లేడు.

  15. యెహోవా దూత, “నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి.

  16. మనోహ యెహోవా దూతతో, “మేము నీకోసం మేకపిల్లను సిద్ధపరచే వరకు దయచేసి ఇక్కడ ఉండండి” అన్నాడు.

  17. అందుకు యెహోవా దూత, “మీరు ఆపినా సరే, నేను మీ ఆహారంలో ఏది తినను. అయితే మీరు దహనబలి సిద్ధపరిస్తే, అది యెహోవాకు అర్పించాలి” అన్నాడు (అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించలేదు.)

  18. అప్పుడు మనోహ యెహోవా దూతను, “నీవు చెప్పింది జరిగాక మేము నిన్ను గౌరవించాలి కాబట్టి నీ పేరేంటి?”

  19. యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు.

  20. మనోహ భోజనార్పణతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి రాతి మీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మనోహ, అతని భార్య చూస్తూ ఉండగా యెహోవా దూత అద్భుతం చేశాడు.

  21. ఆ బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తూవుంటే, ఆ మంటలతో పాటు యెహోవా దూత పైకి వెళ్లిపోయాడు. ఇది చూసి మనోహ, అతని భార్య నేల మీద సాష్టాంగపడ్డారు.

  22. ఆ తర్వాత యెహోవా దూత మనోహకు, అతని భార్యకు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించాడు.

  23. “మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు.

  24. అయితే అతని భార్య, “యెహోవా మనలను చంపాలని అనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు, వీటన్నిటిని మనకు చూపించేవారు కారు, ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు” అని చెప్పింది.

  25. ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు.