కంటెంట్‌కు వెళ్లండి

Women గురించి బైబిల్ వచనాలు

304 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ సలహా రాజుకు, అతని సంస్థానాధిపతులకు నచ్చింది, కాబట్టి మెముకాను ప్రతిపాదించినట్లు రాజు చేశాడు.

  2. అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.

  3. ఎస్తేరు అతనికి నచ్చింది, దయ పొందుకుంది. వెంటనే పరిమళద్రవ్యాలు ఆమెకు అందించి, ప్రత్యేక ఆహారం ఆమెకు ఏర్పాటు చేశాడు. అతడు ఆమె కోసం రాజభవనం నుండి ఏర్పరచబడిన ఏడుగురు స్త్రీ పరిచారకులను నియమించాడు, ఆమెను, ఆమె పరిచారకులను అంతఃపురంలోని శ్రేష్ఠమైన స్థలంలోనికి పంపించాడు.

  4. ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.

  5. అగ్ని వారి యువకులను దహించివేసింది, వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు;

  6. వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.

  7. నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.

  8. ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.

  9. ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?

  10. తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?

  11. మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.

  12. అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.

  13. దెబ్బలు, అవమానం వాని భాగం, వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.

  14. ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.

  15. అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.

  16. నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.

  17. బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను.

  18. అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, దాని ఇంటి వైపే నడుస్తున్నాడు

  19. అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి.

  20. అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది.

  21. (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు;

  22. అది వీధుల్లో తిరుగుతుంది, ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.)

  23. అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది:

  24. “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.

  25. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!