Women గురించి బైబిల్ వచనాలు: False prophets
False prophets గురించి వచనాలు
“మనుష్యకుమారుడా, ప్రవచిస్తున్న నీ ప్రజల కుమార్తెలకు విరోధంగా ప్రవచించి,
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ప్రజలను వలలో వేసుకోవడానికి తమ మణికట్టు మీద తాయెత్తులు కట్టుకుని తమ తలలపై వేసుకోడానికి వివిధ రకాల ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ. మీరు నా ప్రజల జీవితాలను ఉచ్చులో ఇరికించి, మీ సొంత ప్రాణాలను కాపాడుకుంటారా?
మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు.
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను.
నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.
కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”