Skip to content

Wine గురించి బైబిల్ వచనాలు

175 వచనాలు · 83 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.

  2. ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.

  3. “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి. నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి.

  4. మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.

  5. సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.

  6. ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?

  7. మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.

  8. మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!

  9. అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.

  10. లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,

  11. ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.

  12. నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము.

  13. వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు.

  14. నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను.

  15. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.

  16. నవ్వడం కోసం విందు చేస్తారు, ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది, డబ్బు ప్రతిదానికీ సమాధానం.

  17. అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.

  18. నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. చెలికత్తెలు నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. యువతి వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!

  19. ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను.

  20. నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. చెలికత్తెలు స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.

  21. నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.

  22. నీ వెండి మలినం అయిపోయింది, నీ శ్రేష్ఠమైన ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడి పోయింది.

  23. మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.

  24. వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.

  25. ద్రాక్షరసం త్రాగడంలో పేరు పొందినవారికి మద్యం కలపడంలో నేర్పు గలవారికి శ్రమ.