Skip to content

Wine గురించి బైబిల్ వచనాలు: Offered with sacrifices

6 వచనాలు · 83 కోణాలు

Offered with sacrifices గురించి వచనాలు

  1. దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.

  2. దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.

  3. దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

  4. దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది.

  5. దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.

  6. ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.