Wine గురించి బైబిల్ వచనాలు: Sweet, esteemed for flavour and strength
Sweet, esteemed for flavour and strength గురించి వచనాలు
నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.
మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.