Skip to content

Wine గురించి బైబిల్ వచనాలు: Fermented

8 వచనాలు · 83 కోణాలు

Fermented గురించి వచనాలు

  1. “నీవూ, నీ కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా మద్యం త్రాగకూడదు ఇతర పులిసిన పానీయం త్రాగకూడదు, ఒకవేళ అలా చేస్తే మీరు చస్తారు. మీ రాబోయే తరాలకు ఇది నిత్య సంస్కారంగా ఉంటుంది.

  2. వారు ద్రాక్షరసం, మద్యానికి వేరుగా ఉండాలి, ద్రాక్షరసం నుండి గాని మద్యం నుండి గాని తయారుచేసిన చిరక త్రాగవద్దు. వారు ఏ ద్రాక్షరసం త్రాగకూడదు, పండు ద్రాక్షలు గాని ఎండు ద్రాక్షలు గాని తినకూడదు.

  3. దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.

  4. ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.

  5. మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.”

  6. మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!

  7. అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.

  8. ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం, తిత్తులు రెండూ పాడైపోతాయి. అందుకే, వారు క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోస్తారు” అని చెప్పారు.