కంటెంట్‌కు వెళ్లండి

Wife గురించి బైబిల్ వచనాలు

171 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు?

  2. మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు.

  3. అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.

  4. సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి.

  5. మీరు చింతలేనివారై ఉండాలని నేను కోరుకొంటున్నాను. పెళ్ళికానివారు ప్రభువును ఎలా సంతోషపెట్టగలమా అని ప్రభువు విషయాల గురించి చింతిస్తారు.

  6. అయితే పెండ్లియైన వారు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని ఈ లోక విషయాల గురించి చింతిస్తున్నారు.

  7. పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి మధ్య భేదం ఉంది; పెళ్ళికాని స్త్రీ లేదా కన్య తాను శరీరంలో, ఆత్మలో పవిత్రంగా ఉండాలని ప్రభువు కార్యాలను గురించి ఆలోచిస్తుంది. కాని పెళ్ళైన స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలనా అనే ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది.

  8. కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది.

  9. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త చనిపోతే ఆమె తనకిష్టమైన వాన్ని పెళ్ళి చేసుకోవడానికి స్వతంత్రురాలే కాని, అతడు దేవునికి చెందినవాడై ఉండాలి.

  10. అయితే, ఆమె ఉన్న రీతిగానే ఉంటే, అది ఆమెకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. నేనయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నాను.

  11. అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను.

  12. కాబట్టి ఏ పురుషుడైనా తన తలమీద ముసుగు వేసుకుని ప్రార్థించినా లేదా ప్రవచించినా అతడు తన తలను అవమానిస్తున్నాడు.

  13. అయితే ఏ స్త్రీయైనా తలమీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించినా లేదా ప్రవచించినా ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తున్నట్టే. అలా చేస్తే ఆమె తలను క్షౌరం చేసుకున్నట్టే.

  14. స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే ఆమె తలపై ముసుగు వేసుకోవాలి.

  15. పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కాబట్టి అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది.

  16. ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది.

  17. పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది.

  18. ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి.

  19. అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.

  20. పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి.

  21. స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వారు వినయం కలిగి ఉండాలి.

  22. వారు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం.

  23. భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి.

  24. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.

  25. సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.