Skip to content

Trust గురించి బైబిల్ వచనాలు

109 వచనాలు · 66 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి; నాకు అవమానం కలగనివ్వకండి, ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.

  2. దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.

  3. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.

  4. కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను.

  5. దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.

  6. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.

  7. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.

  8. యెహోవా తన సేవకులను విడిపిస్తారు; ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.

  9. దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.

  10. యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.

  11. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

  12. యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.

  13. గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.

  14. మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.

  15. వారు తమ సంపదను నమ్మి, తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.

  16. “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”

  17. కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.

  18. నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?

  19. ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా

  20. మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.

  21. ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.

  22. ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.

  23. నీ పాదాలకు రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.

  24. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

  25. సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.