Skip to content

Trust గురించి బైబిల్ వచనాలు

109 వచనాలు · 66 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

  2. యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

  3. మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  4. రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  5. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.

  6. యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.

  7. ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.

  8. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;

  9. సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.

  10. యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.

  11. ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.

  12. యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.

  13. దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.

  14. తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.

  15. మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.

  16. నిజంగా దేవుడే నా రక్షణ; నేను భయపడను ఆయనను నమ్ముతాను. యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ; ఆయనే నా రక్షణ అయ్యారు.”

  17. కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు.

  18. మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.

  19. యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.

  20. “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.

  21. చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.

  22. యెహోవా ఇలా అంటున్నారు, “మూర్ఖులైన పిల్లలకు శ్రమ, వారు నావి కాని ఆలోచనలు చేస్తారు, నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ పాపానికి పాపం జత చేస్తున్నారు;

  23. వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

  24. కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది, ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.

  25. వారికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే ప్రజల కారణంగా వారందరు సిగ్గుపరచబడతారు.”