Skip to content

Chemosh

8 వచనాలు

Chemosh ను ప్రస్తావించే వచనాలు

  1. మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు. అతడు తన కుమారులను పారిపోయేవారిగా, అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర చెరగా అప్పగించాడు.

  2. మీ దేవుడైన కెమోషు మీకు ఇచ్చేది మీరు తీసుకోరా? అలాగే మా దేవుడైన యెహోవా మాకు ఏది ఇచ్చినా దానిని మేము స్వాధీనం చేసుకుంటాము.

  3. సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు.

  4. నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు.

  5. గతంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెరూషలేముకు ఎదురుగా ఉన్న అవినీతి పర్వతానికి దక్షిణం వైపు సీదోనీయుల హేయ దేవత అష్తారోతుకు, మోయాబీయుల హేయ దేవుడైన కెమోషుకు, అమ్మోనీయుల హేయ దేవుడైన మిల్కోముకు కట్టించిన క్షేత్రాలను అపవిత్రం చేశాడు.

  6. మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.

  7. ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు ఎలా సిగ్గుపడ్డారో మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.

  8. మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలు నాశనమైపోయారు; నీ కుమారులు బందీలుగా వెళ్లారు నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.