కంటెంట్‌కు వెళ్లండి

Treaty గురించి బైబిల్ వచనాలు

40 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు.

  2. కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను.

  3. “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”

  4. హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.

  5. హీరాము సొలొమోనుకు ఇలా జవాబిచ్చాడు: “మీరు నాకు పంపిన సందేశం అంగీకరించాను, నేను మీరు కోరినట్టు దేవదారు, సరళవృక్షాల మ్రానులను ఇస్తాను.

  6. నా పనివారు వాటిని లెబానోను నుండి మధ్యధరా సముద్రతీరానికి తెస్తారు. అక్కడినుండి మీరు చెప్పే స్థలానికి తెప్పలుగా కట్టించి సముద్రం మీదుగా పంపుతాను. అక్కడ వాటిని మీకు అందించే ఏర్పాటు నేను చేస్తాను, మీరు వాటిని తీసుకోవచ్చు. నా కోరిక ప్రకారం మీరు జరిగించి నా రాజకుటుంబానికి ఆహారాన్ని అందించండి.”

  7. ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.

  8. సొలొమోను హీరాముకు అతని ఇంటివారికి ఆహారంగా 20,000 కోరుల గోధుమలను, 20,000 బాతుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఇచ్చాడు. సొలొమోను హీరాముకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చాడు.

  9. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. హీరాము సొలొమోనులు సమాధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.

  10. సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,

  11. సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షపు చెట్లు, బంగారం, తూరు రాజైన హీరాము సరఫరాచేశాడు కాబట్టి సొలొమోను గలిలయ ప్రదేశంలోని ఇరవై పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.

  12. సొలొమోను తనకు ఇచ్చిన ఆ పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి వెళ్లాడు, కాని అవి అతనికి నచ్చలేదు.

  13. అతడు, “నా సోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాంటివి?” అని అడిగాడు. అతడు వాటికి కాబూల్ ప్రాంతం అని పేరు పెట్టాడు, ఈనాటికీ దానికి అదే పేరు.

  14. హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల బంగారం పంపాడు.

  15. అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.