Skip to content

Temptation గురించి బైబిల్ వచనాలు

346 వచనాలు · 52 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.

  2. మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా,

  3. ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

  4. చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.

  5. కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం.

  6. మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు.

  7. మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది.

  8. మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి.

  9. అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి.

  10. ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహాలు ఉన్న మందిరంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షి కలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా?

  11. అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు.

  12. ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

  13. కాబట్టి నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.

  14. సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.

  15. కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారం” అని చెబితే దాన్ని తినవద్దు. మీకు చెప్పినవాని కోసం, మనస్సాక్షి కోసం దాన్ని తినవద్దు.

  16. మీ మనస్సాక్షి గురించి కాదు గాని ఇతరుల మనస్సాక్షి గురించి నేను ఇలా చెప్తున్నాను, ఎందుకంటే వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యం ఎందుకు విమర్శించబడాలి?

  17. నేను కృతజ్ఞతతో పాలు పంచుకుంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన దాని కోసం నేనెందుకు నిందించబడాలి?

  18. నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి.

  19. యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, దేవుని సంఘానికైనా మరి ఎవరికైనా సరే అభ్యంతరంగా ఉండకండి.

  20. మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.

  21. సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.

  22. అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.

  23. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు.

  24. కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.

  25. నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది.