కంటెంట్‌కు వెళ్లండి

Temptation గురించి బైబిల్ వచనాలు: Resistance to temptation

121 వచనాలు · 52 కోణాలు

"Temptation" కోసం వెతకండి

Resistance to temptation గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది.

  2. కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు.

  3. ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు.

  4. ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు.

  5. అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము.

  6. “యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.

  7. “ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటే మోసం వైపు నా పాదం తొందరపడి ఉంటే

  8. దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక, అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.

  9. ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే, ఒకవేళ నా హృదయం నా కళ్ల చేత నడిపించబడి ఉంటే, నా చేతులు అపవిత్రం అయి ఉంటే,

  10. అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక, నా పంటలు పెరికివేయబడును గాక.

  11. “ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా, నేను నా పొరుగువాని తలుపు దగ్గర వాని భార్య కోసం పొంచి ఉంటే,

  12. నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక, ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక.

  13. ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది, ఒక శిక్షించవలసిన పాపము.

  14. అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని; అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది.

  15. “ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా, ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు, నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే,

  16. దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను? లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?

  17. గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?

  18. “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,

  19. ఒకవేళ అనాధలకు పెట్టకుండా నేనే ఒంటరిగా భోజనం చేసినా

  20. ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,

  21. నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,

  22. నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,

  23. అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.

  24. దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.

  25. “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,