Skip to content

Tact గురించి బైబిల్ వచనాలు

84 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోవాబు తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి రాజును దీవిస్తూ ఇలా అన్నాడు, “నా ప్రభువైన రాజా! నీవు నీ సేవకుడైన నా మనవి అంగీకరించావు కాబట్టి నా ప్రభువైన రాజు దృష్టిలో నీ సేవకుడనైన నేను దయ పొందానని ఈ రోజు నాకు తెలిసింది.”

  2. ఆ పట్టణంలో ఉన్న ఒక తెలివైన స్త్రీ బిగ్గరగా, “వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతన్ని ఇక్కడకు రమ్మనండి” అని చెప్పింది.

  3. యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.

  4. అప్పుడు ఆమె, “పూర్వం ప్రజలు ‘ఏదైనా సమస్య ఉంటే ఆబేలులో పరిష్కరించుకోండి’ అనేవారు. అలా వారు పరిష్కారం పొందేవారు.

  5. మేము ఇశ్రాయేలులో నెమ్మదస్తులం నమ్మకమైనవారము. మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. యెహోవా వారసత్వాన్ని మీరెందుకు నిర్మూలం చేస్తారు?” అని నిలదీసింది.

  6. అందుకు యోవాబు, “నేను నాశనం చేయాలని నిర్మూలం చేయాలని అనుకోవడం లేదు.

  7. అసలు విషయం అది కాదు. బిక్రి కుమారుడైన షేబ అనే ఎఫ్రాయిం కొండ ప్రాంతానికి చెందిన ఒకడు రాజైన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఆ ఒక్కడిని మీరు మాకు అప్పగిస్తే, నేను ఈ పట్టణాన్ని విడిచివెళ్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “సరే, వాని తల గోడ పైనుండి పడవేస్తాం” అని చెప్పింది.

  8. ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.

  9. అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు.

  10. అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”

  11. అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!” అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”

  12. అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”

  13. రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.

  14. ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు.

  15. మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది.

  16. సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు.

  17. ఆ నగర గుమస్తా ఆ ప్రజలను శాంతపరస్తూ వారితో ఇలా అన్నాడు: “తోటి ఎఫెసీయులారా, అర్తెమి దేవి గుడికి, ఆకాశం నుండి పడిన ఆమె ప్రతిమకు ఎఫెసు పట్టణం సంరక్షణ అని లోకమంతటికి తెలియదా?

  18. ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు.

  19. అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు.

  20. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేమేత్రికి అతని తోటి పనివారికి ఎవరి మీద ఆరోపణలు ఉన్నా, వారి కోసం న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి వారు అక్కడికి వెళ్లి వీరి మీద ఫిర్యాదు చేసుకోవాలి.

  21. మీకు ఏ విషయమైనా తెలియచేయాలని అనుకుంటే వాటిని క్రమపద్ధతిలో న్యాయసభలో సరిచేసుకోవాలి.

  22. అయితే ఈ రోజు జరిగిన అల్లరి గురించి అధికారులు మనపై విచారణ చేసే ప్రమాదం ఉంది. ఏ కారణం లేకుండా కలిగిన ఈ అల్లరికి మనం ఏ కారణం ఇవ్వగలమని” వారితో అన్నాడు.

  23. అతడు ఈ మాటలను చెప్పి ప్రజలను పంపేశాడు.

  24. వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు.

  25. యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు.