Skip to content

Tact గురించి బైబిల్ వచనాలు

84 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.

  2. అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?

  3. దేవుడు మిద్యానీయుల నాయకులైన ఓరేబు, జెయేబులను మీకు అప్పగించారు. మీతో పోల్చుకుంటే నేనేమి చేయగలిగాను?” అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది.

  4. అయితే పనికిమాలినవారు కొందరు, “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు?” అని అంటూ అతన్ని తృణీకరించి అతనికి కానుకలు తీసుకురాలేదు. అయినా సౌలు మౌనంగా ఉన్నాడు.

  5. ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.

  6. అప్పుడు ప్రజలు సమూయేలుతో, “సౌలు మనలను పరిపాలిస్తాడా అని అడిగిన వారేరి? మేము వారిని చంపడానికి వారిని తీసుకురండి” అన్నారు.

  7. అయితే సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు కాబట్టి ఈ రోజు ఎవరిని చంపవద్దు” అన్నాడు.

  8. అప్పుడు సమూయేలు ప్రజలతో, “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏర్పరచుకుందాము” అన్నాడు.

  9. కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.

  10. అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.

  11. ఆమె తన సేవకులతో, “మీరు ముందు వెళ్లండి, నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది. అయితే ఆమె తన భర్తయైన నాబాలుతో ఏమీ చెప్పలేదు.

  12. ఆమె తన గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా, దావీదు అతని మనుష్యులు ఆమెకు ఎదురువచ్చారు. అప్పుడు ఆమె వారిని కలిసింది.

  13. అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు.

  14. రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.

  15. అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది.

  16. ఆమె అతని పాదాల మీద పడి, “నా ప్రభువా, తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను; మీ సేవకురాలినైన నన్ను మాట్లాడనివ్వండి, మీ సేవకురాలి మాట వినండి.

  17. నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు.

  18. నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.

  19. మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.

  20. “మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.

  21. మిమ్మల్ని బాధించాలని, ప్రాణం తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే, నా ప్రభువైన మీ ప్రాణం మీ దేవుడైన యెహోవా దగ్గర ఉన్న జీవపు మూటలో భద్రంగా కట్టబడుతుంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లుగా ఆయన మీ శత్రువుల ప్రాణాలను విసిరివేస్తారు.

  22. యెహోవా నా ప్రభువైన మీకు వాగ్దానం చేసినదంతటిని నెరవేర్చి మిమ్మల్ని ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమిస్తారు.

  23. నిష్కారణంగా మీరు రక్తం చిందించారన్న లేదా స్వయంగా మీరే పగతీర్చుకున్నారన్న హృదయ వేదన గాని దుఃఖం గాని నా ప్రభువైన మీకు కలుగకూడదు. యెహోవా నా ప్రభువైన మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ సేవకురాలినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని మనవి చేసుకుంది.

  24. అందుకు దావీదు అబీగయీలుతో, “నన్ను కలుసుకోడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక.

  25. నీవు సమయోచితంగా మంచి పని చేసి ఈ రోజు రక్తపాతం చిందించకుండ నన్ను కాపాడావు నా సొంత చేతులతో నేను పగతీర్చుకోకుండ నన్ను అడ్డుకున్నావు కాబట్టి నీవు దీవించబడుదువు గాక.