Skip to content

Strife గురించి బైబిల్ వచనాలు

158 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.

  2. ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.

  3. పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.”

  4. “నీ మీద కోప్పడిన వారందరు ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు; నిన్ను వ్యతిరేకించేవారు కనబడకుండా నశించిపోతారు.

  5. నీ శత్రువుల కోసం నీవు వెదకినా, వారు నీకు కనపడరు. నీతో యుద్ధం చేసేవారు ఏమి లేనివారిగా అవుతారు.

  6. అతడు కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు.

  7. మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

  8. యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి!

  9. నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.

  10. అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.

  11. “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.

  12. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి.

  13. ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి.

  14. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి.

  15. “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.

  16. ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.

  17. ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’

  18. యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు.

  19. ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు.

  20. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:

  21. “ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.

  22. ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.

  23. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు.

  24. “ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే.

  25. వారు వినకపోతే, ‘ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’ నీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు.