Skip to content

Seekers గురించి బైబిల్ వచనాలు

165 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక.

  2. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.

  3. కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.

  4. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.

  5. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.

  6. దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా

  7. మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను.

  8. మునుపటి రోజులను గురించి, చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను.

  9. రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది:

  10. “ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా?

  11. ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా?

  12. దేవుడు కరుణించడం మరచిపోయారా? ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా

  13. దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.

  14. నేను మీ దేవుడనైన యెహోవాను, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను.

  15. వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.

  16. యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.

  17. యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.

  18. ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,

  19. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.

  20. యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.

  21. కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.

  22. మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా

  23. ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.

  24. ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు; వారి మొర విని వారిని రక్షిస్తారు.

  25. నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,