Skip to content

Seekers గురించి బైబిల్ వచనాలు

165 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,

  2. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, దేవుని తెలివిని కనుగొంటావు.

  3. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను.

  4. ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు.

  5. కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.

  6. రాత్రంతా నేను పడుకుని నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు.

  7. నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.

  8. పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను.

  9. నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.

  10. మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?

  11. అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.

  12. రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.

  13. నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.

  14. వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.

  15. నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.

  16. “భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.

  17. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తాను. “వారు దారి ప్రక్కన తింటారు చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది.

  18. వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు.

  19. నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను నా రహదారులు ఎత్తు చేయబడతాయి.

  20. చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”

  21. రాజులు నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. అప్పుడు నీవు, నేను యెహోవాను అని, నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.”

  22. “నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, నా మాట వినండి: మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి;

  23. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.

  24. దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.

  25. “సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు విమోచకుడు వస్తాడు,” అని యెహోవా తెలియజేస్తున్నారు.