కంటెంట్‌కు వెళ్లండి

Resignation గురించి బైబిల్ వచనాలు

132 వచనాలు · 30 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము.

  2. సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి.

  3. నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.

  4. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.

  5. నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.

  6. మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.

  7. ఎందుకంటే, అప్పుడు మీలో ఎవరు ఏ శ్రమల వలన కలవరం చెందకుండా ఉండాలని. అయినా మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉందని మీకు బాగా తెలుసు.

  8. కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

  9. యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు.

  10. కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.

  11. ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది.

  12. చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు.

  13. పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు.

  14. మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు.

  15. తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి, “నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు, ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు,

  16. ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.”

  17. మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు?

  18. అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు.

  19. మనల్ని క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగి ఉన్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాము. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి!

  20. తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంతకాలం మనల్ని క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు.

  21. ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా శిక్షణ పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు.

  22. కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.

  23. దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి.

  24. అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు.

  25. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.