కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.

  2. “యెహోవా, నన్ను కరుణించండి; నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.”

  3. నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.

  4. నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.

  5. నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.

  6. “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.

  7. నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.

  8. యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.

  9. నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.

  10. నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.

  11. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక!

  12. సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.

  13. నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది. నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను?

  14. “మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.

  15. ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.

  16. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

  17. నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  18. మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి.

  19. పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది.

  20. నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను.

  21. రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.

  22. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

  23. నా దేవా, నాకు న్యాయం తీర్చండి, భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా నా పక్షంగా వాదించి, మోసగాళ్ల నుండి దుష్టుల నుండి నన్ను విడిపించండి.

  24. మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?

  25. మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.