కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన. యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు.

  2. యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.

  3. యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు.

  4. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి.

  5. ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.

  6. నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను.

  7. యెహోవా, మీ దయతో నన్ను పర్వతంలా స్థిరపరిచారు. కాని మీరు మీ ముఖాన్ని దాచినప్పుడు నేను కలవరపడ్డాను.

  8. యెహోవా నేను మీకు మొరపెట్టాను; ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను:

  9. “నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా?

  10. యెహోవా! ఆలకించండి కరుణించండి. యెహోవా, నాకు సహాయంగా ఉండండి.”

  11. మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు.

  12. నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను.

  13. దావీదు ధ్యానకీర్తన. తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

  14. యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.

  15. నేను మౌనంగా ఉండి, రోజంతా మూలుగుతూ ఉన్నందుకు నా ఎముకలు కృశించాయి.

  16. రాత్రింబగళ్ళు మీ చేయి నాపై భారంగా ఉంది; వేసవిలో నీరు ఎండిపోయినట్లు నాలో సారం యింకి పోయింది. సెలా

  17. అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా

  18. మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.

  19. నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా

  20. మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.

  21. వివేచనలేని గుర్రంలా కంచరగాడిదలా ప్రవర్తించకండి కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు.

  22. దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.

  23. నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి. యథార్థ హృదయులారా, మీరు పాడండి.

  24. సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.

  25. తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు వారు తమను తాము పొగడుకొంటారు.