కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు.

  2. యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.

  3. నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.

  4. నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.

  5. యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి.

  6. దావీదు కీర్తన. యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; మీరు నా కొండయై ఉన్నారు, నా మొరను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను.

  7. నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి, కరుణ కొరకై నేను చేసే మొర సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి.

  8. దుష్టులతో, చెడు చేసేవారితో పాటు నన్ను లాక్కు వెళ్లకండి. వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు.

  9. వారి క్రియలకు వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి. చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి; వారికి తగిన ప్రతిఫలమివ్వండి.

  10. యెహోవా క్రియలను గాని ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు, కాబట్టి ఆయన వారిని పడగొడతారు మరలా వారిని నిలబెట్టరు.

  11. యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.

  12. యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.

  13. యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.

  14. మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.

  15. దావీదు కీర్తన. దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.

  16. యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.

  17. యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; మహిమగల దేవుడు ఉరుముతారు మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.

  18. యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.

  19. యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి; లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.

  20. ఆయన లెబానోను పర్యతాలను దూడలా, షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.

  21. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;

  22. యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.

  23. యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.

  24. యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.

  25. యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు; యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.