Skip to content

Proclamation గురించి బైబిల్ వచనాలు: Imperial

25 వచనాలు · 2 కోణాలు

Imperial గురించి వచనాలు

  1. ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు.

  2. రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

  3. ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు.

  4. ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది.

  5. ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.

  6. రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు.

  7. తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు.

  8. మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు.

  9. మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”

  10. వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.

  11. అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.

  12. తర్వాత ఆ రాజవస్త్రాన్ని ఆ గుర్రాన్ని రాజు యొక్క అత్యంత ఘనులైన ఓ అధిపతికి అప్పగించాలి. రాజు సన్మానించాలని అనుకున్న ఆ వ్యక్తికి ఆ రాజ వస్త్రం వేయించి ఆ గుర్రం మీద నగర వీధుల్లో త్రిప్పుతూ, ‘రాజు ఒక వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఆ వ్యక్తికి ఇలా చేయబడుతుంది!’ అని అంటూ ఆ వ్యక్తి ఎదుట చాటాలి” అని అన్నాడు.

  13. మొర్దెకై రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులను వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి, రాజు సేవకు ప్రత్యేకంగా ఉపయోగించే గుర్రాలపై వేగంగా స్వారీ చేసే వార్తాహరులతో వాటిని పంపాడు.

  14. రాజు ఆదేశం, యూదులు ప్రతి పట్టణంలో తమను తాము కాపాడుకునే హక్కు కలిగించింది; వారి మీద, వారి స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేసే ఏ జాతి వారినైనా, ఏ సంస్థానం వారినైనా, వారు నాశనం చేయవచ్చు, చంపవచ్చు, నిర్మూలించవచ్చు, వారి శత్రువుల ఆస్తిని కొల్లగొట్టవచ్చు.

  15. రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో యూదులు ఇలా చేయడానికి నియమించబడిన రోజు అదారు నెల అనే పన్నెండవ నెల, పదమూడవ రోజు.

  16. ఆ రోజున యూదులు తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడేలా ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి అన్ని సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి పంపాలని ఆజ్ఞ ఇవ్వబడింది.

  17. రాజాజ్ఞ ప్రకారం వార్తాహరులు, రాజ్య గుర్రాల మీద వేగంగా స్వారీ చేస్తూ వెళ్లి, ఆ శాసనాలను షూషను కోటలో అందజేశారు.

  18. బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం: “అరణ్యంలో యెహోవా కోసం మార్గాన్ని సిద్ధపరచండి ఎడారిలో మన దేవునికి రహదారిని సరాళం చేయండి.

  19. సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.

  20. అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే:

  21. బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు మీరు విన్నప్పుడు, మీరు సాగిలపడి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించాలి.

  22. దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”

  23. కాబట్టి వారు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్న వెంటనే సమస్త దేశాలవారు, వివిధ భాషల ప్రజలు నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహం ఎదుట సాగిలపడి దానిని పూజించారు.

  24. రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక!

  25. అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు.