Skip to content

Oil గురించి బైబిల్ వచనాలు

97 వచనాలు · 49 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.

  2. వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు.

  3. ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.

  4. అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు.

  5. “ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు.

  6. వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.

  7. ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.

  8. భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి.

  9. ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.

  10. యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.

  11. నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.

  12. మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.

  13. పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”

  14. ఒకడు ఇరవై కుప్పల ధాన్యం నాటగా పది కుప్పల ధాన్యమే వస్తుంది. ద్రాక్షగానుగ తొట్టిలో నుండి యాభై కొలతల ద్రాక్షరసం తీయడానికి వెళ్తే ఇరవై కొలతలు మాత్రమే ఉంటుంది.

  15. నేను మరలా, “ఆ రెండు బంగారు గొట్టాలలో నుండి బంగారు నూనె కుమ్మరించే ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు ఏంటి?” అని అతన్ని అడిగాను.

  16. బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు.

  17. వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు.

  18. నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది.

  19. అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.

  20. “అందుకు వాడు, ‘మూడు వేల లీటర్ల నూనె’ అని జవాబిచ్చాడు. “వెంటనే ఆ గృహనిర్వాహకుడు వానితో, ‘నీ చీటి తీసుకుని, పదిహేను వందల లీటర్లు అని వ్రాసుకో’ అన్నాడు.

  21. మరియ సుమారు అయిదువందల గ్రాముల, అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన అత్తరు తెచ్చి యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది.

  22. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి.