కంటెంట్‌కు వెళ్లండి

Oil గురించి బైబిల్ వచనాలు: Given by God

5 వచనాలు · 49 కోణాలు

"Oil" కోసం వెతకండి

Given by God గురించి వచనాలు

  1. ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:

  2. మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.

  3. వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు.

  4. యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.

  5. నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.