Oil గురించి బైబిల్ వచనాలు: First-fruits of, given to God
First-fruits of, given to God గురించి వచనాలు
మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.
అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.
“అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము.