కంటెంట్‌కు వెళ్లండి

Oil గురించి బైబిల్ వచనాలు: Used for food

13 వచనాలు · 49 కోణాలు

Used for food గురించి వచనాలు

  1. “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు.

  2. ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి.

  3. “ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  4. “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,

  5. మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు.

  6. అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.

  7. ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో.

  8. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.

  9. ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది.

  10. ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.

  11. సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.

  12. ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.

  13. వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.