Skip to content

Oil గురించి బైబిల్ వచనాలు

97 వచనాలు · 49 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;

  2. “వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

  3. అభిషేక తైలాన్ని తీసుకుని అతని తలపై పోసి అతన్ని అభిషేకించాలి.

  4. “నీవు ఈ శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు తీసుకోవాలి: పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం గోపరసం 500 షెకెళ్ళు, వాసనగల దాల్చిన చెక్క సగం అనగా 250 షెకెళ్ళు, పరిమళ వాసనగల నిమ్మగడ్డి నూనె 250 షెకెళ్ళు

  5. లవంగపట్ట 500 షెకెళ్ళు, అయిదు శేర్ల ఒలీవనూనె; అన్నీ పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం తీసుకోవాలి.

  6. వాటిని పవిత్ర అభిషేక తైలంగా, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ మిశ్రమం చేయాలి. అది పవిత్ర అభిషేక తైలం అవుతుంది.

  7. నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది.

  8. దానిని సాధారణ మనుష్యుల శరీరంపై పోయకూడదు, ఆ సూత్రాన్ని ఉపయోగించి మరే ఇతర నూనెను తయారుచేయవద్దు. ఇది పవిత్రమైనది, మీరు దానిని పవిత్రంగా పరిగణించాలి.

  9. దాన్ని పోలిన పరిమళద్రవ్యాన్ని తయారుచేసినవారు, యాజకుల మీద కాకుండా ఇతరుల మీద దానిని పోసిన వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి’ అని చెప్పు.”

  10. పరిశుద్ధస్థలం కోసం అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపము.

  11. దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;

  12. ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం; సమావేశ గుడారపు ద్వారానికి తెర;

  13. అలాగే దీపాలు వెలిగించడానికి ఒలీవనూనె, అభిషేక తైలానికి, పరిమళ వాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు తెచ్చారు.

  14. అంతేకాక వారు పవిత్ర అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ వాసనగల ధూపాన్ని తయారుచేశారు.

  15. బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర;

  16. “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు.

  17. ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి.

  18. ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.

  19. “ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  20. “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,

  21. “వెలుగు కోసం దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

  22. సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  23. యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.

  24. “అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”

  25. అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి.