కంటెంట్‌కు వెళ్లండి

Nineveh గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

  2. సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.

  3. రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.

  4. నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.

  5. నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.

  6. నీనెవె నీరు పారుతున్న నీరు కొలనులా ఉంది. “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.

  7. వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!

  8. అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, హంతకుల పట్టణానికి శ్రమ! నిత్యం బాధితులు ఉండే, రక్తపు పట్టణానికి శ్రమ!

  9. కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది!

  10. రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా, వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి, వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి! ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది, మృతులు కుప్పలుగా పడి ఉన్నారు, మృతదేహాలకు లెక్క లేదు, మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు.

  11. తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, తన వ్యభిచారం ద్వారా దేశాలను బానిసలుగా మార్చిన వేశ్య; మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది.

  12. సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.

  13. నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను.

  14. నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.

  15. అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.

  16. నీకు కూడా మత్తు ఎక్కుతుంది; నీవు వెళ్లి దాక్కుని శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు.

  17. నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న అంజూరపు చెట్లలా ఉన్నాయి; అవి కదిలించబడినప్పుడు, తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి.

  18. నీ సైన్యాన్ని చూడు, వారంతా బలహీనులు. నీ దేశపు ద్వారాలు నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి; అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది.

  19. ఆకాశంలోని నక్షత్రాల కంటే మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ, మిడతల్లా వారు దేశాన్ని దోచుకుని ఎగిరిపోతారు.

  20. ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి అష్షూరును నాశనం చేస్తారు. నీనెవెను పూర్తిగా నిర్జనమై ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు.

  21. గొర్రెల మందలు, పశువుల మందలు, దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి. ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ దాని స్తంభాలపై కూర్చుంటాయి. వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది, రాళ్లతో తలుపులు నిండిపోతాయి, దేవదారు దూలాలు నాశనమవుతాయి.

  22. ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.

  23. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.”

  24. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు.