Nineveh గురించి బైబిల్ వచనాలు: Degradation and contempt put on
Degradation and contempt put on గురించి వచనాలు
సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.
నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను.
నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.
ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.