కంటెంట్‌కు వెళ్లండి

Nineveh గురించి బైబిల్ వచనాలు: Coming up of the Babylonish armies against

5 వచనాలు · 35 కోణాలు

Coming up of the Babylonish armies against గురించి వచనాలు

  1. నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. కోటకు కాపలా ఉండు, రహదారి మీద నిఘా వేయి, నడుము బిగించుకో, నీ బలమంతటిని కూడగట్టుకో!

  2. దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

  3. సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.

  4. రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.

  5. కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది!