Skip to content

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు.

  2. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి. అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు.

  3. ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.

  4. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.

  5. “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి.

  6. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: “ఓ బావి ఉప్పొంగు! దాని గురించి పాడండి.

  7. రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,

  8. మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు,

  9. బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.

  10. యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది.

  11. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.

  12. “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.

  13. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు.

  14. యెహోవా ఆత్మ సౌలును విడిచివెళ్లి, యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ అతన్ని బాధించింది.

  15. అప్పుడు సౌలు సేవకులు, “యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను బాధిస్తుంది.

  16. మా ప్రభువైన నీవు నీ సేవకులకు ఆజ్ఞ ఇస్తే సితారా చక్కగా వాయించగల ఒకనిని వెదికి తీసుకువస్తాము. దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా వాయించడం వలన నీకు బాగవుతుంది” అన్నారు.

  17. కాబట్టి సౌలు తన సేవకులతో, “బాగా వాయించే వానిని వెదికి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.

  18. దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయించేవాడు, అప్పుడు దురాత్మ సౌలును విడిచివెళ్లి అతనికి నెమ్మది కలిగేది.

  19. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు.

  20. ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ, “సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” అని పాడారు.

  21. And they brought it out of the house of Abinadab which was at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.

  22. దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.

  23. ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.

  24. నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి?

  25. ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.