Skip to content

Mountain గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు.

  2. మీరంతా దగ్గరకు వచ్చి ఆ పర్వతం క్రింద నిలబడ్డారు, అది దట్టమైన మేఘాలు, కటిక చీకటి కమ్మి, ఆకాశం వరకు అగ్నితో మండుతూ ఉంది,

  3. ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు.

  4. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశాల్లో ఎక్కడైతే ప్రజలు తమ దేవుళ్ళను సేవిస్తారో, అనగా ఎత్తైన పర్వతాలమీద కొండల పైన విస్తరించి ఉన్న చెట్టు క్రింద ఉన్న ఆ స్థలాలన్నిటిని పూర్తిగా నాశనం చేయాలి.

  5. అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.

  6. “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.

  7. వారు తమ కోసం ప్రతి ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, క్షేత్రాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా నిలిపారు.

  8. ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.

  9. “పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా కొండలు వాటి స్థానం తప్పునట్లుగా,

  10. మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.

  11. యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.

  12. చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.

  13. సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు.

  14. పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”

  15. మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!

  16. మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!

  17. మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.

  18. యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.

  19. అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది.

  20. వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.

  21. అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.

  22. ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది, లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు.

  23. మరల అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు.

  24. యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.

  25. ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు.