Skip to content

Mountain గురించి బైబిల్ వచనాలు: Melted

9 వచనాలు · 11 కోణాలు

Melted గురించి వచనాలు

  1. మీరంతా దగ్గరకు వచ్చి ఆ పర్వతం క్రింద నిలబడ్డారు, అది దట్టమైన మేఘాలు, కటిక చీకటి కమ్మి, ఆకాశం వరకు అగ్నితో మండుతూ ఉంది,

  2. ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు.

  3. అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.

  4. యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.

  5. మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!

  6. మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!

  7. మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.

  8. అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.

  9. ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది, లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు.