Skip to content

Ministers గురించి బైబిల్ వచనాలు

201 వచనాలు · 118 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను.

  2. క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి.

  3. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  4. ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.

  5. సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు.

  6. నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను.

  7. మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.

  8. కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.

  9. పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు.

  10. అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.

  11. ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు?

  12. ఈ మాటలు కేవలం మానవ అధికారంతో చెప్తున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తున్నది కదా!

  13. మోషే ధర్మశాస్త్రంలో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు” అని వ్రాయబడి ఉంది. దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నారా?

  14. ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవారు, త్రొక్కేవారు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి.

  15. మీ మధ్యలో ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మేము నాటితే, మీ నుండి ఈ లోకసంబంధమైన పంటను మేము కోస్తే అది గొప్ప విషయమా?

  16. సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ!

  17. నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను.

  18. అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.

  19. అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి నా శరీరాన్ని నలగ్గొట్టి, దాన్ని లోబరచుకొంటున్నాను.

  20. యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, దేవుని సంఘానికైనా మరి ఎవరికైనా సరే అభ్యంతరంగా ఉండకండి.

  21. అలాగే నేను కూడా అందరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.

  22. నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి.

  23. అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే.

  24. అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి.

  25. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు.