Ministers గురించి బైబిల్ వచనాలు: Pray for them
Pray for them గురించి వచనాలు
సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను.
మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.
సువార్త మర్మాన్ని నేను భయం లేకుండా తెలియజేయడానికి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు మాటలు అనుగ్రహించబడేలా నా కోసం కూడా ప్రార్థన చేయండి.
మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.