కంటెంట్‌కు వెళ్లండి

Minister (1) గురించి బైబిల్ వచనాలు

256 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.

  2. తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.

  3. మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగి ఉంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.

  4. అలాంటివారిలో హుమెనేయు, అలెగ్జాండరు అనేవారు ఉన్నారు. వారిని నేను సాతానుకు వదిలేశాను, అప్పుడు వారు దేవుని దూషించకుండ ఉండడం నేర్చుకుంటారు.

  5. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అందరి పక్షంగా అనగా రాజుల కోసం అధికారంలో ఉన్న వారందరి కోసం దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే, మనం పూర్ణ భక్తి, పరిశుద్ధత కలిగి శాంతి సమాధానాలతో ప్రశాంతంగా జీవించగలము.

  6. For kings, and for all that are in authority; that we may lead a quiet and peaceable life in all godliness and honesty.

  7. ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.

  8. ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.

  9. ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు.

  10. ఆయనే ప్రజలందరి రక్షణ కోసం విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.

  11. దీని కోసమే నేను ప్రకటించేవానిగా, అపొస్తలునిగా యూదేతరులకు నమ్మకమైన బోధకునిగా ఉండడానికి నియమించబడ్డాను, నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పడం లేదు.

  12. కాబట్టి ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను.

  13. అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,

  14. దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.

  15. ఒక స్త్రీ పూర్ణ వినయంతో శాంత స్వభావంతో నేర్చుకోవాలి.

  16. స్త్రీ బోధ చేయడానికి గాని, పురుషునిపై అధికారం చెలాయించడానికి గాని నేను అనుమతించను; ఆమె మౌనంగా ఉండాలి.

  17. ఎందుకంటే ఆదాము మొదట సృష్టించబడ్డాడు, ఆ తర్వాత హవ్వ.

  18. అంతేకాక, మోసపోయింది ఆదాము కాదు; స్త్రీయే మోసపోయింది పాపిగా అయ్యింది.

  19. అయితే స్త్రీలు వివేకం కలిగి విశ్వాసంలో, ప్రేమ, పరిశుద్ధతలో కొనసాగుతూ జీవిస్తే, పిల్లలను కనుట ద్వారా వారు రక్షించబడతారు.

  20. ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పనిని కోరడమే.

  21. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.

  22. అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.

  23. అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండేలా చూసుకోవాలి.

  24. ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?

  25. అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు.