Skip to content

Integrity గురించి బైబిల్ వచనాలు

96 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,

  2. అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.

  3. దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.

  4. “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,

  5. ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి, నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,

  6. నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,

  7. నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,

  8. అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.

  9. “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,

  10. వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా నా నోటిని పాపానికి అనుమతించలేదు

  11. ‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’ అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా

  12. ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు, ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది

  13. మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ, నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?

  14. నేను గుంపులకు భయపడి గాని వంశాల ధిక్కారానికి బెదిరిపోయి గాని నేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా?

  15. “ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది! నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక; నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.

  16. ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను, నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను.

  17. ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను, పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.

  18. “నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,

  19. వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా దాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా,

  20. అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.” యోబు తన మాటలు ముగించాడు.

  21. యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే

  22. నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే

  23. అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా

  24. దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

  25. నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;