Skip to content

Integrity గురించి బైబిల్ వచనాలు

96 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

  2. నీచులను అసహ్యించుకుని యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు; తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు, తమ మనస్సు మార్చుకొననివారు;

  3. వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.

  4. యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?

  5. ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!

  6. వారు యెహోవా నుండి దీవెన పొందుతారు వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.

  7. దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.

  8. యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;

  9. నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.

  10. కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి; నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది.

  11. దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

  12. వారికి ఏ బాధలు లేవు; వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి.

  13. సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు.

  14. కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు.

  15. వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, వారి చెడు ఊహలకు హద్దులు లేవు.

  16. వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు.

  17. వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి.

  18. అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు.

  19. “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు.

  20. దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.

  21. నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.

  22. రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి.

  23. నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే.

  24. ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.

  25. Until I went into the sanctuary of God; then understood I their end.